skip to main |
skip to sidebar
నా కౌగిళ్ళ వాకిట ముందు ముగ్గు పోసి..
నా గుండె లోయల్లో కొలువుండి పోవా...!!
చిన్ని నవ్వు కోసం పరితపిస్తున్నావా ... గుక్కెడు ప్రేమ కోసం గుండె కోసుకుంటావా ???
పదమని మనసే చెప్పిన వేళ... పాదం అడుగుకి సంకోచం .....!!! పాదం అడుగే వేసిన వేళ హృదయానికి పుట్టెను చిన్న భయం...!!! భయపడి ప్రేమించే నాకు లేదా ప్రేమించే వరం..!!! నిన్ను చేరేవరకు ఆగదేమో నా ప్రేమ జ్వరం... !!!!
....దేవదాస్
నిన్నటి దాక నా నిదురలో నువ్వు కలవి ..
నేటి మొదలు నా నిజం లో ప్రతి రూపానివి ....
నా అంతర్యానికి ఆత్మవి ....!!!
ఉడికించే బియ్యానికి అన్నం అయ్యే దాకే నరకం ...
నిన్నటి నా ఎడబాటు దానికంటే అమానుషం ...!!!
అలంటి రావణ రాజ్యాన్ని అంతమొందించి ... నా సీత ని కాదు కాదు
నా ----- తెచ్చుకొని రామాయణం బదులు సురేశాయణం రాద్దమనుకుటున్న ... దానికి అనుమతిస్తావా నా సఖి .. ప్రియ సఖి !!!!
దేవదాస్